
పటుశిష్టప్రతిపాలకుఁడ వనఁగ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పటుశిష్టప్రతిపాలకుఁడ వనఁగ ఘటన నఖిలమును గాతువుగా ॥చ1॥ తత్తుమురుగ దైత్యుల దనుజుల నవి మొత్తి మోఁది చలమునఁ జెలగి జొత్తుపాపలుగ సొరిది విరోధుల- నెత్తురు వడుతువు నీవేకా ॥చ2॥ తళతళమెఱుచుసుదర్శనాయుధం- బలరుచు నొకచే నమరఁగను బలుదైత్యులదొబ్బలుఁ బేగులు నని నిలువునఁ జెండుదు నీవేకా ॥చ3॥ దిట్టవు సూత్రవతీపతి వసురలఁ జట్టలు చీరఁగఁ జతురుఁడవు రట్టడి వేంకటరమణుని వాకిటి- పట్టపు నేనాపతిపటకా |
రాగము: సాళంగనాట రేకు: 0033-06 సంపుటము: 1-207 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగనాట