
పండియుఁ బండదు చిత్తము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పండియుఁ బండదు చిత్తము పరిభవ యెడయదు కాంక్షల యెండలనే కాఁగితి మిఁక నేలాగోకాని ॥చ1॥ పదిగోట్లుజన్మంబులఁ బాయనికర్మపుఁ బాట్లు వదలక వొక నిమిషములో వడిఁదీరుచు నితఁడు చెదరని నిజదాసులకును శ్రీహరి, మా కిపుడంతక హృదయము నిలువదు చంచల మేలాగోకాని ॥చ2॥ కూపపు బహునరకంబుల కోట్లసంఖ్యలఁ బొరలేటి- పాపము లొకనిమిషయములోఁ బాపఁగఁగలఁ డితఁడు కాపాడఁగఁ దలచిన యీకమలాపతి, నే మీతని- యేపునఁ గని మననే మిఁక నేలాగోకాని ॥చ3॥ జడిగొని యెన్నఁడు బాయనిసంసారపుబంధంబుల విడుమని వొకనిమిషములో విడిపించును యితఁడు కడుఁగొలిచినవారికి వేంకటపతి, నే మీతని- నెడయక కొలువఁగలేమిఁక నేలాగోకాని |
రాగము: మలహరి రేకు: 0045-02 సంపుటము: 1-274 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మలహరి