
పంకజాక్షులు సొలసిపలికి నగఁగా
॥పల్లవి॥ పంకజాక్షులు సొలసిపలికి నగఁగా నింకా నారగించు మిట్టనే ఆయ్యా open ॥చ1॥ కలవంటకములు పులుఁగములు దుగ్ధాన్నములు పలుదెరఁగులై న అప్పములగములు నెలకొన్న నేతులును నిరతంపు చక్కెరలు గిలుకొట్టుచును నారగించవయ్యా ॥చ2॥ పెక్కువగుసైఁ దంపుపిండి వంటల మీఁద పిక్కటిలు మెఱుఁగు బొడి బెల్లములును వొక్కటిగఁ గలపుకొని వొలుపుఁబప్పులతోడ కిక్కిరియ నిటు లారగించవయ్యా ॥చ3॥ కడుమధురమైన మీఁగడ పెరుగులను మంచి- అడియాల పూరుఁగాయల రుచులతో బడిబడిగ నవకంపుఁ బళ్లెరంబులతోడ కడునారగించు వేంకటగిరీంద్రా |
రాగము: ధన్నాశి రేకు: 0023-02 సంపుటము: 1-138 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాశి