గురువారం , 21 నవంబర్ 2024

నేడు ఇడుపులపాయలో ఘనంగా వైఎస్ ద్వితీయ వర్ధంతి

ఇడుపులపాయ : స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ద్వితీయ వర్ధంతి శుక్రవారం నిర్వహించనున్నారు. ఓదార్పుయాత్రలో ఉన్న వైఎస్ తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఇడుపులపాయకు చేరుకొని వైఎస్సార్ సృతివనంవద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ఇప్పటికే కడప జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం YSRకార్యకర్తలు, నేతలు ఇడుపులపాయకు చేరుకొని వైఎస్సార్ సృతివనం వద్ద ఘనంగా నివాళ్లు అర్పించనున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇడుపులపాయలో జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమై భవిష్యత్ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది.

చదవండి :  సొంత నియోజకవర్గాల్లో ఖంగుతిన్న డిఎల్, మైసూరా

వైఎస్సార్ పార్టీ నేతలు ముందుచూపుతో రాష్టవ్య్రాప్తంగా స్వర్గీయ మహానేత అభిమానులు ఇడుపులపాయకు చేరుకుంటారని 30 వేల మందికి అన్నదానం చేసేందుకు సిద్ధమయ్యారు.

గత ఏడాది మొదటి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయను రాష్టవ్య్రాప్తంగా ఉన్న వేలాది మంది ప్రజలు తరలివచ్చి స్వర్గీయ ముఖ్యమంత్రికి ఘనంగా నివాళ్లు అర్పించారు.

ఇడుపులపాయకు జగన్ వస్తుండడంతో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు జగన్‌తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

చదవండి :  'గంజి బువ్వ' కథా సంపుటి ఆవిష్కరణ

ఇదీ చదవండి!

ys jagan

‘పులివెందులకు తాగునీటి ఇక్కట్లు తప్పవు’

జలాశయాలను పరిశీలించిన జగన్ 16 టిఎంసిల నీళ్ళు ఇవ్వాల్సి ఉంటే 2.55 టిఎంసీలే ఇచ్చారు పులివెందుల: విపక్ష నేత, పులివెందుల …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: