
నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు భావించలేనివారిపాప మింతేకాని ॥చ1॥ పరమపద మొసఁగి పాపమడంచేనని చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె నిరతిని భూమిలోన నీవల్లఁ దప్పు లేదు పరగ నమ్మనివారిపాప మింతేకాని ॥చ2॥ నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత దాపుగా నీవల్ల నింకఁ దప్పు లేదు యెంచిచూచి పైపై నమ్మనివారిపాప మింతే కాని ॥చ3॥ బంతిఁ బురాణములను భక్తసులభుఁడ నని అంతరాత్మ వీమాట అడితివి తొలుతనే ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు పంతాన నమ్మనివారిపాప మింతేకాని |
రాగము: భైరవి రేకు: 0097-05 సంపుటము: 1-487 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భైరవి