
నీవేకా చెప్పఁజూప నీవె నీవెకా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నీవేకా చెప్పఁజూప నీవె నీవెకా శ్రీ విభుప్రతినిధివి సేన మొదలారి ॥చ1॥ నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద దేవతలఁ గనిపించే దేవుఁడవు యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజ- సేవకుఁడవు నీవెకా సేనమొదలారి ॥చ2॥ పసిఁడి బద్దలవారు పదిగోట్లు గొలువ దెసలఁ బంపులువంపే దీరుఁడవు వసముగా ముజ్జగాలవారి నిందరిని నీ- సిసువులఁగా నేలిన సేనమొదలారి ॥చ3॥ దొరలై నయసురుల తుత్తుమురు సేసి జగ- మిరవుగా నేలితి వేకరాజ్యమై పరగుసూత్రవతీ పతివై వేంకటవిభు- సిరుల పెన్నిధి నీవే సేనమొదలారి |
రాగము: లలిత రేకు: 0042-01 సంపుటము: 1-255 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత