నీవేకానింక నే నన్య మెఱఁగ యే-
॥పల్లవి॥ నీవేకానింక నే నన్య మెఱఁగ యే- త్రోవ చూపి నాకుఁ దోడయ్యెదవయ్య
॥చ1॥ అపరాధనత కోట్లయినవి వొక్క- నెపమున ననుఁ గావనేరవా అపరిమితదురితా లైనవి యే- ఉపమచేత నన్ను నుద్దరించెదవయ్య ॥చ2॥ అతిశయముగఁ గర్మినైతిని నీ- మతము నాకొకయింత మరపవా ఇతర కర్మారంభహితుఁడను గతి మోక్ష మెటువలెఁ గల్పించెదవయ్య ॥చ3॥ తిరువేంకటాచలాధీశ్వరా నీ- శరణాగతులఁ బ్రోవఁజాలవా పరమదయానందపరుఁడవు యే- వెరవున భవములు వెడలఁ ద్రోచెదవయ్య | రాగము: శ్రీరాగం రేకు: 0003-04 సంపుటము: 1-17 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం