
నీలవేణి (కథల సంపుటి) – భారతం నాదమునిరాజు
నీలవేణి కథల సంపుటి
కడప జిల్లాలో మొదటి కథా రచయితగా భారతం నాదమునిరాజు గుర్తించబడ్డారు. 1930లో జన్మించిన నాదమునిరాజు గారి జన్మస్థలం వేంపల్లి.రాజు గారు 1956లో రాసిన ‘నీలవేణి’ కడప జిల్లా నుండి వెలువడిన మొదటి కథగా సాహితీకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాదమునిరాజు గారి కథలను వారి మొదటి కథ ‘నీలవేణి’ పేరుతో ఒక సంపుటిగా వెలువరించినారు.