
నిత్యానంద ధరణీధర ధరారమణ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నిత్యానంద ధరణీధర ధరారమణ కాత్యాయనీ స్తోత్రకామ కమలాక్ష ॥చ1॥ అరవిందనాభ జగధాధార భవదూర పురుషోత్తమ నమో భువనేశా కరుణాసమగ్ర రాక్షసలోకసంహార- కరణ కమలాదీశ కరిరాజవరద ॥చ2॥ భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద సాగరనిజావాస సకలాధిప నాగారిగమన నానావర్ణనిజదేహ భాగీరథీజనక పరమ పరమాత్మ ॥చ3॥ పావన పరాత్పర శుభప్రద పరాతీత కైవల్యకాంత శృంగారరమణ శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో దేవతారాద్య సుస్థిరకృపాభరణ |
రాగము: శ్రీరాగం రేకు: 0004-05 సంపుటము: 1-25 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం