
నిక్కించీ గర్ణములు మానిసిమెకము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నిక్కించీ గర్ణములు మానిసిమెకము నిక్కపుఁ గరుణతో మానిసిమెకము ॥చ1॥ కొండ తనకు గద్దెగా గోరి కూచుండిన దదే నిండురాజసమున మానిసిమెకము గండుమీరి దానవునికండలు చెక్కుచు నూర్పు నిండించీ నాకసము మానిసిమెకము ॥చ2॥ కరములు వేయింటాఁ గైకొని యాయుధములు నిరతి జళిపించీ మానిసిమెకము సురలను నసురల జూచిచూచి మెచ్చిమెచ్చి నెరపీని నవ్వులు మానిసిమెకము ॥చ3॥ యెక్కించి తొడమీఁద నిందిరతో మేలమాడీ నిక్కపుగాఁగిటను మానిసిమెకము అక్కడ శ్రీవేంకటాద్రి నహోబలమునందు నెక్కొని మమ్మేలెను మానిసిమెకము |
రాగము: నాట రేకు: 0089-02 సంపుటము: 1-436 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాట