సోమవారం , 23 డిసెంబర్ 2024

నింపడమే నా జీవిత ధ్యేయం…

రాయచోటి – లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలను సస్యశ్యామలం చేయగలిగే వెలిగల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయించి, హంద్రీ-నీవా జలాల తో నింపడమే తన జీవిత ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. హంద్రీ – నీవా జలాలను తరలించడం ద్వారానే దుర్భిక్ష ప్రాంతమైన రాయచోటి నియోజక వర్గంలో శాశ్వతంగా కరవును నివారించవచ్చని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ ప్రాంతీయులు కరువు, కాటకాలతో అల్లాడుతున్నారని, వర్షాభావంతో బోర్లలో నీరులేక సాగులోని పండ్ల తోటలన్నీ నిలువునా ఎండిపోతున్నాయన్నారు. రైతులు ట్యాంకర్లు, బిందెలతో చెట్లకు నీరందిస్తూ వాటిని కాపాడుకునేందుకు తపన పడుతుండడం బాధాకరమన్నారు.

చదవండి :  విభజన జరిగితే ఎడారే

ఖరీఫ్‌లో పంట లు సాగుచేసి నష్టపోయిన జిల్లా రైతాంగానికి ప్రభుత్వం రూ. 53 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసిందని, ఇందులో రాయచోటి నియోజక వర్గానికి రూ.13 కోట్ల వరకు ఇన్‌పుట్ సబ్సిడీ అందుతుందన్నారు.

ఇదీ చదవండి!

అనంతపురం గంగమ్మ దేవళం

గంగమ్మకు కల్లు ముంతలతో ప్రత్యేక పూజలు

లక్కిరెడ్డిపల్లె: రాయలసీమలోనే ప్రసిద్ది గాంచిన లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గంగమ్మ జాతర ఉత్సవాలు గురువారం వైభవంగా జరిగినాయి. జాతరకు భక్తజనం …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: