
నా తప్పు లోఁ గొనవే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నా తప్పు లోఁ గొనవే నన్నుఁ గావవే దేవ చేఁతలిన్నీ జేసి నిన్నుఁజేరి శరణంటిని ॥చ1॥ అందరిలో నంతర్యామివై నీవుండఁగాను యిందరిఁ బనులుగొంటి నిన్నాళ్ళును సందడించి యిన్నిటా నీచైతన్యమై యుండఁగాను వందులేక నేఁ గొన్నివాహనా లెక్కితివి ॥చ2॥ లోకపరిపూర్ణుఁడవై లోనా వెలి నుండఁగాను చేకొని పూవులుఁ బండ్లుఁ జిదిమితిని కైకొని యీమాయలు నీకల్పితమై వుండఁగాను చౌకలేక నేవేరే సంకల్పించితిని ॥చ3॥ యెక్కడచూచిన నీవే యేలికెవై వుండఁగాను యిక్కడాఁ దొత్తుల బంట్ల నేలితి నేను చక్కని శ్రీవేంకటేశ సర్వాపరాధి నేను మెక్కితి నన్ను రక్షించు ముందెఱఁగ నేను |
రాగము: సాళంగనాట రేకు: 0087-05 సంపుటము: 1-427 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగనాట