
నారాయణ నీనామము బుద్ధిఁ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నారాయణ నీనామము బుద్ధిఁ జేరినాఁ జాలు సిరులేమి బాఁతి is-aber.net ॥చ1॥ ననుపైన శ్రీవిష్ణునామము పేరు- కొనఁగానే తేఁకువ మీరఁగా ఘనమైన పుణ్యాలు గలుగఁగా తమ- కనయముఁ బరమది యేమిబాఁతి ॥చ2॥ నలువైన శ్రీహరినామము మతిఁ- దలఁచిననాబంధము లూడఁగా యెలమి దీనిఁ బఠియించినా యీ- కలుషములేల కలుగు నెవ్వరికి ॥చ3॥ వేంకటపతి నామవిభవము కర్మ పంకములెల్లఁ బరిమార్పఁగా బింకమై తలఁపెడి ప్రియులకుఁ యెందు- నింక నీ సుఖమిది యేమిబ్రాఁతి |
రాగము: సామంతం రేకు: 0043-02 సంపుటము: 1-262 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం