
నాది నవసీమ గొంతుక (కవిత)
కరువు గడ్డ కాదిది
కాబోయే పోరు బిడ్డ
నెత్తుటి గుడ్డ కాదిది
కాబోయే ఉద్యమ అడ్డా
మౌనాంగీకారం కాదు రా…..
బద్దలవబోయే సీమ నిశ్శబ్ద ఘీంకారం
ఎర్ర చందనం నీ సొత్తు కాదిక
అది నా సీమ అస్తిత్వం
అది మొరటుతనం కాబోదిక
మాది నిప్పంటి సీమ కరుకుతనం
కూరలో కరేపాకు కాదిక
పోరులో కుర్రాళ్ళ జజ్జనక
బీడుకట్టు కాదిక
గోసెగ్గట్టిన ముళ్ళగట్టె
నవ్యాంధ్ర కాదిక
నాది నవసీమ గొంతుక
జై రాయలసీమ
జై జై రాయలసీమ
– వేమన సీమ (రచయిత కలం పేరు )