
నాగేశ్వరిని చంపేశారు
కడప: రెండు నెలల క్రితం అదృశ్యమైన నాగేశ్వరి, ఆమె కొడుకును భర్తే చంపేశాడని పోలీసులు ఎట్టకేలకు నిర్ధారించారు. రిమ్స్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి శవాలను శుక్రవారం పోలీసులు వెలికితీశారు. ఘటనస్థలంలోనే పోస్టుమార్టం చేశారు.
పోలీసుల కథనం మేరకు…కడప మాసాపేటకు చెందిన నాగేశ్వరి అలియాస్ నీలిమా (37), కడప మరియాపురానికి చెందిన రాజాప్రవీణ్‌లకు 2003లో వివాహమైంది. వీరికి దివ్యవర్షిత, ప్రణీత్‌రాజ్(8)అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2015 డిశంబరు 12న నాగేశ్వరి అలియాస్ నీలిమా(37) ఆమె కొడుకు ప్రణ్‌త్‌రాజ్(8)లు కనిపించలేదని నాగేశ్వరి సోదరుడు వెంకటరామయ్య మహిళ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శుక్రవారం రాజాప్రవీణ్ కడప వీఆర్‌వో వద్దకు వచ్చి తన భార్య నాగేశ్వరి, కొడుకు ప్రణిత్‌రాజ్‌లను తానే హత్య చేశానని నేరం ఒప్పుకున్నాడు. వీఆర్‌వో అతన్ని తమకు అప్పగించారని కడప డీఎస్పీ వెల్లడించారు.
రాజాప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. రాజాప్రవీణ్‌కు వివాహేతర సంబంధాలున్నాయి. వాటి గురించి భార్య నాగేశ్వరి ప్రశ్నిస్తోంది. డిశంబరు 11న భార్య నాగేశ్వరి, కొడుకు ప్రణిత్ రాజాలకు ఇచ్చిన బిర్యానీలో మత్తుమందు కలపడంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. తరువాత రాజాప్రవీణ్, అతని మేనమామ రాజులు వారిని గొంతునులిపి హత్య చేశారు. రెండు మృతదేహలను వేర్వేరుగా సంచుల్లో వేసుకుని అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రిమ్స్ సమీపంలోని అటవీప్రాంతంలో ఆ రెండు మృతదేహలను వేసి పూడ్చిపెట్టారన్నారు.
రాజాప్రవీణ్ అతని మేనమామపై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు.