కడప : ప్రొద్దుటూరు పట్టణంలో నవంబరు 2వ వారంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన (Science fair) నిర్వహించనున్నట్లు డీఈవో కె.అంజయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాదు ఎస్‌సీఈఆర్‌టీ డైరక్టర్ నవంబరు 2వ వారంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలని ఆదేశించారన్నారు.
కావున ప్రధానోపాధ్యాయులందరూ వారి పాఠశాలల నుంచి ఒక ఉపాధ్యాయుడిని, ఇద్దరు విద్యార్థులను, ఒక ఎగ్జిబిట్‌తో పంపాలని కోరారు.