
నమో నారాయణాయ నారాయణాయ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నమో నారాయణాయ నారాయణాయ సగుణబ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో ॥చ1॥ నిత్యాయ విబుధసంస్తుత్యాయ నిత్యాధి- పత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యయ పత్యక్షాయ సన్మానససాం- గత్యాయ జగదవనకృత్యాయ తేనమో ॥చ2॥ అక్రమోద్దతబాహువిక్రమాతిక్రాంత శుక్రశిష్యోన్యూలనక్రమాయ శక్రాదిగీర్వాణవక్రభయభంగని- ర్వక్రాయ నిహతారిచక్రాయ తేనమో ॥చ3॥ అక్షరాయాతినిరపేక్షాయ పుండరీ- కాక్షాయ శ్రీవత్సలక్షణాయ అక్షీణవిజ్ఞానదక్షయోగీంద్రసం- రక్షానుకంపాకటాక్షాయ తేనమో ॥చ4॥ కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణేందుకోటీరతరుణీ మనస్త్సోత్ర- పరితోషచిత్తాయ పరమాయ తే నమో ॥చ5॥ పాత్రదానోత్సవప్రథిత వేంకటరాయ ధాత్రీశకామితార్థప్రదాయ గోత్రభిన్మణిరుచిరగాత్రాయ రవిచంద్ర- నేత్రాయ శేషాద్రినిలయాయ తే నమో నారయణాయ |
రాగము: శుద్దవసంతం రేకు: 0044-02 సంపుటము: 1-269 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శుద్దవసంతం