నగుఁబాట్లఁ బడేనాజిహ్వ

॥పల్లవి॥
నగుఁబాట్లఁ బడేనాజిహ్వ
పగటున నిదివో పావనమాయ
link
॥చ1॥
ఇల నిందరి నుతియించి పెంచువలె
నలినలియైనది నా జిహ్వ
నలినోదరుశ్రీనామము దలఁచిన-
ఫలమున కిదివో పావనమాయ
॥చ2॥
భ్రమఁబడి మాయపుపడఁతులతమ్మలు
నమలి చవులుగొనె నాజిహ్వ
అమరవంద్యుఁడగుహరి నుతియించఁగ
ప్రమదము చవిగొని పావనమాయ
॥చ3॥
నెలఁతలపలు యోనిద్రవనదులను
నలుగడ నీఁదెను నాజిహ్వ
అలసి వేంకటనగాధిపయనుచును
పలికినయంతనె పావనమాయ
రాగము: ముఖారి
రేకు: 0009-02
సంపుటము: 1-56

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి

చదవండి :  ఎవ్వరిఁ గాదన్న నిది నిన్నుఁ గాదంట

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: