నగధర నందగోప నరసింహ వో – అన్నమయ్య సంకీర్తన

నగధర నందగోప నరసింహ వో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
నగధర నందగోప నరసింహ వో
నగజవరద శ్రీ నారసింహ
॥చ1॥
నరసింహ పరంజోతి నరసింహా వీర-
నరసింహ లక్ష్మీనారసింహా
నరసఖ బహుముఖ నారసింహా వో-
నరకాంతక జేజే నారసింహా
॥చ2॥
నమో నమో పుండరీకనారసింహ వో-
నమితసురాసురనారసింహా
నమకచమకహిత నారసింహ వో
నముచిసూదనవంద్య నారసింహా
॥చ3॥
నవరసాలంకార నారసింహా వో-
ననీతచోర శ్రీనారసింహా
నవగుణివేంకటానారసింహా వో-
నవమూర్తి మండేము నారసింహ
రాగము: సామంతం
రేకు: 0042-05
సంపుటము: 1-259

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  కొండో నుయ్యో కుమతులాల

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *