నంద నందన వేణునాద – అన్నమయ్య సంకీర్తన

నంద నందన వేణునాద – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
నంద నందన వేణునాద వినోదము
కుంద కుంద దంతహాస గోవర్ధనధరా
॥చ1॥
రామ రామగోవింద రవిచంద్రలోచన
కామ కామకలుష వికారవిదూరా
ధామ ధామవిభవత్ర్పతాపరూప దనుజని-
ర్ధూమధామ కరణచతుర భవభంజనా
॥చ2॥
కమల కమలవాస కమలారమణ దేవో-
త్తమ తమో గుణసతతవిదూర
ప్రమదత్ర్పమదానుభవభావకరణ
సుముఖ సుధానంద శుభరంజనా
॥చ3॥
పరమ పరాత్పర పరమేశ్వరా
వరద వరదామల వాసుదేవ
చిరచిర ఘననగ శ్రీవేంకటేశ్వర
నర హరినామ పన్నగశయనా
రాగము: ధన్నాశి
రేకు: 0061-03
సంపుటము: 1-312

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ధన్నాశి

చదవండి :  తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరాని

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: