
దైవమా నీకు వెలితా తలఁపువెలితేకాక – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ దైవమా నీకు వెలితా తలఁపువెలితేకాక వేవేలుకర్మాల వేసారఁగ వలసె ॥చ1॥ హరి యంటే బాపేటి అన్ని పాపాలు సేసిన పొరి నందుపై నమ్మిక పుట్టదుగాక నరసింహ యంటే వచ్చే నానాపుణ్యాలకు తిరముగా ఋణములు దీర్చుకొనఁగలవా ॥చ2॥ దేవ జగన్నాథ యంటే తెగనిజన్మము లేవి కైవశము నామనసు గాదుగాక గోవింద యనియంటేఁ గూడని పదవు లేవి కావిరిఁ గాల మూరకె గడుపేము నేము ॥చ3॥ వేదనారాయణమంటే వీడేటిబంధములు ఆదిగా మూఁడులోకాలనైనా నున్నదా శ్రీదేవిపతి యైన శ్రీవేంకటేశ్వరుఁడా యేదెసా నీవే నన్ను యీడేర్తువుగాక |
రాగము: సాళంగనాట రేకు: 0084-03 సంపుటము: 1-407 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగనాట