
దేహ యీతగవు దీర్చవయ్యా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ దేహ యీతగవు దీర్చవయ్యా వేవేలకు నిది విన్నవమయ్యా ॥చ1॥ తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికిఁ బోవునయా పెనఁగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడి కేఁగుదురయ్యా ॥చ2॥ పొదుగుచు మనమున బొడమినయాసలు అదన నెక్కడికి నరుగునయా వొదుగుచు జలములనుండు మత్స్యములు పదపడి యేగతి బాసీనయ్యా ॥చ3॥ లలి నొకటొకటికి లంకెలు నివే అలరుచు నేమని యందునయా బలు శ్రీవేంకటపతి నాయాత్మనుఁ గలిగితి వెక్కడి కలుషములయ్యా |
రాగము: మలహరి రేకు: 0089-01 సంపుటము: 1-435 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మలహరి