
దేవ నీమాయతిమిర మెట్టిదో నా- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ దేవ నీమాయతిమిర మెట్టిదో నా- భావము చూచి గొబ్బనఁ గానవే ॥చ1॥ వెడదు: తడవి విరతిఁబొంది తలఁగలేను ఆడియాసలఁ దిరిగి అలుయుచుండుదుఁగాని మడి దొసకుల నివి మానలేను ॥చ2॥ హేయము స్త్రీసుఖమని యెఱుఁగుచుండుదుఁగాని పాయపుమదముచేతఁ బాయలేను పాయనిపాపాలు చూచి భయమందుచుందుఁగాని వోయయ్య యివి సేయకుండలేను ॥చ3॥ కలకాల మిన్నియును గందు విందుఁగాని మఱి యెలమి నొక్కటనైన యెచ్చరలేను బలిమి శ్రీవేంకటేశ బంధముక్తునిఁజేసి తలఁపులో నెలకొని దయఁజూడవయ్యా |
రాగము: ఆహిరి రేకు: 0080-01 సంపుటము: 1-382 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి