దూరం సేను దున్న‌మాకు – జానపదగీతం

దూరం సేను దున్న‌మాకు – జానపదగీతం

దూరం సేను దున్న‌మాకు దిన్నెలెక్కి సూడ‌మాకు
ఊరి ముందర ఉల‌వ స‌ల్ల‌య్యో కొండాలరెడ్డి ||దూరం సేను||

అత‌డుః కొత్త ప‌ల్లె చేల‌ల్లో న కంది బాగా పండి ఉంది
కంది కొయ్య‌ను వ‌స్తావేమ్మా నా చిన్నారి సుబ్బులు
కంది కొయ్య‌ను వ‌స్తావేమ‌మ్మా ..
ఆమెః కంది కొయ్య‌ను వ‌స్తానబ్బీ ఎడ‌మ కంటికి ఎండా త‌గిలే
కోరు మీటి గొడుగు ప‌ట్ట‌య్యో కొండాల రెడ్డి
కోరు మీటి గొడుగు ప‌ట్ట‌య్యో  ||దూరం సేను||

చదవండి :  ఎత్తులపై గళమెత్తు - సొదుం శ్రీకాంత్

అత‌డుః వ‌ల్లూరు సేల‌ల్లోన వ‌రి బాగా పండిండాది
వ‌ర్రి గొయ్య‌ను వ‌స్తావేమమ్మా నా సిన్నారి సుబ్బులు
ఆమెః వ‌రి కొయ్య‌ను వ‌స్తాన‌బ్బీ కుడి కంటికి ఎండ త‌గిలే
కోరు మీటి గొడుగు ప‌ట్ట‌య్యో కొండాలరెడ్డి
కోరు మీటి గొడుగు ప‌ట్ట‌య్యా కొండాలరెడ్డి ||దూరం సేను||

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: