
దిబ్బలు వెట్టుచుఁ దేలిన దిదివో – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ దిబ్బలు వెట్టుచుఁ దేలిన దిదివో ఉబ్బు నీటిపై నొక హంసా ॥చ1॥ అనువునఁ గమలవిహారమై నెలవై వొనరి వున్నదిదె వొక హంసా మనియెడి జీవుల మానససరసుల- వునికి నున్న దిదె వొక హంసా ॥చ2॥ పాలునీరు నేర్పరిచి పాలలో- నోలనాడె నిదె వొక హంసా పాలుపడిన యీ పరమహంసముల- వోలి నున్నదిదె వొక హంసా ॥చ3॥ తడవి రోమరంధ్రంబుల గుడ్ల- నుడుగక పొదిగీ నొక హంసా కడువేడుక వేంకటగిరి మీఁదట- నొడలు వెంచెనిదె యొక హంసా |
రాగము: కాంబోధి రేకు: 0003-03 సంపుటము: 1-16 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కాంబోధి