త్వమేవ శరణం త్వమేవ – అన్నమయ్య సంకీర్తన

త్వమేవ శరణం త్వమేవ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
త్వమేవ శరణం త్వమేవ శరణం
కమలోదర శ్రీజగన్నాథా
॥చ1॥
వాసుదేవ కృష్ణ వామన నరసింహ
శ్రీసతీశ సరసిజనేత్రా
భూసురవల్లభ పురుషోత్తమ పీత-
కౌశేయవసన జగన్నాథా
॥చ2॥
బలభద్రానుజ పరమపురుష దుగ్ద-
జలధినిహార కుంజరవరద
సులభ సుభద్రాసుముఖ సురేస్వర
కలిదోషహరణ జగన్నాథా
॥చ3॥
వటపత్రశయన భువనపాలన జంతు
ఘటకారకరణ శృంగారాధిపా
పటుతర నిత్యవైభవరాయ తిరువేం-
కటగిరినిలయ జగన్నాథా
రాగము: శ్రీరాగం
రేకు: 0063-02
సంపుటము: 1-323

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  కనుఁగొనఁగ జీవుఁ డెరఁగఁడుగాక యెరిఁగినను - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: