
తొలుఁబాపపుణ్యాలతోడఁ బుట్టితినట
॥పల్లవి॥ తొలుఁబాపపుణ్యాలతోడఁ బుట్టితినట బలువైనభవములఁ బడలేనా open ॥చ1॥ గాముల యింటనే కాఁపనయితినట పాముపుట్ట నుండియైన బతుకలేనా గోమున హేయపుఁగుండకూడు నించితినట గామిడి నేగారేతిత్తిఁగా నోపనా ॥చ2॥ కట్టైనగుణములచే కట్టువడితినట చుట్టపుబంధాలరొచ్చుకు నోపనా దట్టపుటాసల నేఁదాల్చితినట నా- వెట్టకాయము మోపవెఱచేనా ॥చ3॥ నిగిడినలోపల నీ వుండుదుట పగవారికి నేఁ బగిలేనా తగువేంకటేశ నీదయవాఁడనట యీ- వగల నిన్నిఁట గెలువఁగలేనా |
రాగము: సాళంగం రేకు: 0028-01 సంపుటము: 1-169 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సాళంగం