
తొక్కనిచోట్లు దొక్కెడిమనసు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తొక్కనిచోట్లు దొక్కెడిమనసు యెక్కడ గతిలే దింకనో తెరువు read ॥చ1॥ పాపము వాయదు పై పై మనసున కోపము దీరదు కొంతైనా దీపన బాధయుఁ దీర దిన్నియును యేపునఁ బెనఁగొనె నింకనో తెరువు ॥చ2॥ యెవ్వనమదమును నెడయదు కోరికె కొవ్వును నణఁగదు కొంతైనా రవ్వగు మమకారముఁ బెడఁబాయదు యెవ్విధియును లేదింకవో తెరువు ॥చ3॥ వెఱపును విడువదు వెడమాయలఁబడి కొఱఁతయుఁ దీరదు కొంతైనా తెఱఁ గొసఁగేటి శ్రీతిరువేంకటపతి – నెఱిఁగీ నెఱఁగలే మిఁకనో తెరువు |
రాగము: సామంతం రేకు: 0045-04 సంపుటము: 1-276 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం