
తెల్లవారనియ్యరో తెరువు యీ- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తెల్లవారనియ్యరో తెరువు యీ- పల్లదపుదొంగలెల్లఁ బారాడుతెరువు is-aber.net ॥చ1॥ దొంతరపూవులతోఁట తూరుపుఁ దెరువు చింతపూవుఁ దేనెలచెమ్మ తెరువు సంతులేని సతియింటిచాయ తెరువు యింతలోనె చలిఁబడి యెండదాఁకే తెరువు ॥చ2॥ పాముపుట్ట గొంటిమీఁది పడుమటితెరువు చీమకదొంతరలోనిచిన్న తెరువు గాములుగాచుక యుండే గాలి తెరువు యేమిటా నెక్కడవుత నెరఁగనితెరువు ॥చ3॥ అన్ని దిక్కులునుఁ దానేయైవున్న తెరువు పన్నీటి కాలువలబాట తెరువు కన్నుల వేంకటపతిఁ గన్న తెరువు మిన్నునేలఁగూడినమీఁది తెరవు |
రాగము: కాంబోది రేకు: 0040-02 సంపుటము: 1-244 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కాంబోది