
తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద- వెలుఁగులోపలికి వెలుఁగేలా ॥చ1॥ అరయ నాపన్నుని కభయ మీవలెఁగాక ఇరవైనసుఖిఁ గావనేలా వఱతఁబోయెడివాని వడిఁ దీయవలెఁగాక దరివానిఁ దివియంగఁ దానేలా ॥చ2॥ ఘనకర్మారంభునికట్లు విడవలెఁగాక యెసి మునక్తునిఁ గావనేలా అనయము దుర్బలుని కన్నమిడవలెఁగాక తనసినవానికిఁ దానేలా ॥చ3॥ మితిలేనిపాపకర్మికిఁ దా వలెఁగాక హితవెఱుఁగుపుణ్యుని కేలా ధృతి హీనుఁ గృపఁ జూచి తిరువేంకటేశ్వరుఁడు తతిఁ గావకుండినఁ దానేలా |
రాగము: గుండక్రియ రేకు: 0003-05 సంపుటము: 1-18 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ