శుక్రవారం , 22 నవంబర్ 2024

తుమ్మేటి రఘోత్తమరెడ్డికి కేతు పురస్కారం ప్రధానం

ప్రతి విద్యార్థి మాతృభాషమీద పట్టు సాధించాలని జాతీయస్థాయి భారతీయ భాషాభివృద్ధి మండలి సభ్యుడు, ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి పిలుపునిచ్చారు. నందలూరు కథానిలయం ఏటా ప్రదానం చేసే కేతువిశ్వనాధరెడ్డి పురస్కారాన్ని  తుమ్మెటి రఘోత్తమరెడ్డికి అందజేశారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డిని కేతు విశ్వనాథరెడ్డి పురస్కారంతో రాజంపేట లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు అబ్దుల్లా, కార్మిక సంఘ మాజీ నాయకుడు నువ్వుల చిన్నయ్యలు సత్కరించారు. శ్రీప్రతిభా ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేతు విశ్వనాధరెడ్డి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

చదవండి :  'లౌకికవాద ధృక్పథంతో సాగితే అది అభ్యుదయం'

మాతృభాష మీద పట్టు సాధించాలంటే కథలు, కవిత్వం, నాటకాలు చదవాలన్నారు. వ్యాపార,వాణిజ్య ఆంగ్లభాషను చదవడం తప్పుకాదన్నారు. మాతృభాషను మరిస్తే తల్లిని మరచినట్లేనన్నారు. సాహిత్యం భాషలోని మెలకువలను గుర్తు చేస్తుందన్నారు.

ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతు నేటి చదువు కార్పోరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లి బట్టీబట్టే విద్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రముఖ రచయితలు మధురాంతకం నరేంద్ర, ప్రతిమ, సింగమనేని నారాయణ,, రాజంపేట లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు అబ్దుల్లా, నందలూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గజ్జెల రాంప్రసాద్‌, కథానిలయం అధ్యక్షుడు ఎ.రాజేంద్రప్రసాద్‌ తదితరులు మాట్లాడారు. రచయితలు, కథానిలయం ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చదవండి :  'వాళ్ళు సీమ పేరు పలకడానికి భయపడుతున్నారు'

కథావార్షిక ఆవిష్కరణ

మధురాంతకం నరేంద్ర రూపొందించిన కథావార్షిక పుస్తకాన్నికేతు విశ్వనాధరెడ్డి ఆవిష్కరించారు. కేంద్ర మాన వవనరుల శాఖ ఆధ్వర్యంలో గల ఈ భాషామండలి సభ్యుడిగా దేశంలోని మిగిలిన 21 భాషల అనుభవాన్ని తీసుకొని తెలుగు భాషాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

ఇదీ చదవండి!

cpi

‘లౌకికవాద ధృక్పథంతో సాగితే అది అభ్యుదయం’

కడప: ప్రజాస్వామ్య దేశంలో రచనలు లౌకికవాద ధృక్పథంతో సాగితే అది అభ్యుదయంగా చెప్పవచ్చని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: