
తుదిలేనిబంధము తోడునీడై నేను
॥పల్లవి॥ తుదిలేనిబంధము తోడునీడై నేను వదలినా నన్ను వదల దేమినేతు voltaren végbélkúp voltaren szemcsepp ॥చ1॥ గులిమికొలుచు దీరఁగుడువ నియ్యక కొత్త – కొలుచు మీఁదమీఁదఁ గొలవఁగా కలసిన కర్మపుఁగలిమిచేతఁ దృష్ణ వెలితిగాక యిల్లువెడల దేమినేతు ॥చ2॥ అన్నియు నొకమాటే యనుభవింపఁగఁ జేసి కొన్ని వెచ్చము లొనఁగూడించి యిన్నిటాఁ దిరువేంకటేశ నిర్మలునిఁగా నన్నుఁజేసి నీవు నాకుఁ గలుగవయ్య |
రాగము: గుండక్రియ రేకు: 0027-07 సంపుటము: 1-168 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుండక్రియ