అన్నన్నా తిరగబడు… (కవిత) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

అన్నన్నా తిరగబడు… (కవిత) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

రాయల సీమజనాల్లో
రగత మురికిపారాల
రాజకీయ రంకుల్ని
ఈడ్చి ఈడ్చి తన్నాల.

ఈపొద్దు ఇంటిలోన
రేపేమో మంటిలోన
ఏదొకటో కాకుంటే
మనకింకా ముక్తి లేదు.

ఒకకంటికి సున్నము
వెన్న మరో కంటికి
ఆదినుండి మనసీమకు
అంతులేని అన్యాయం.

ప్రాజెక్టును ఇస్తామని
మదరాసునుండి పిల్చినారు
చుక్క నీరు ఇవ్వకుండ
కిందకు మళ్లించినారు .

సీమ రైతు గుండెలన్ని
ముళ్లచెట్ల కంపలాయె
ఎన్నాళ్లీఅగచాట్లు
అన్నన్నా తిరగబడు.

రైతు కంటి నీళ్లతో
పంటలెలా పండుతాయి
మభ్య పెట్టు మాటలతో
పరిపాలనెలా సాగుతుంది.

చదవండి :  వాటమైన కేటుగాడు (కవిత) - సొదుం శ్రీకాంత్

వున్న వాడికే అన్నీ
దోచిపెట్తు దుర్బుధి
బడుగు మాసీమకేమొ
నోటినిండ మట్టి.

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *