
తలఁప వెనక నుయ్యి తగరు ముందట దీనఁ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తలఁప వెనక నుయ్యి తగరు ముందట దీనఁ దొలఁగ నాకుఁ దెరువు దోపఁ దేమిసేతు ॥చ1॥ మమకార విముక్తి మార్గదూరము నీపై మమతసేయక నాకు మనరాదు మమత మేలో నిర్మమత మేలో దీని- క్రమమున క్రమము నేఁ గాన నేమి సేతు ॥చ2॥ కర్మమార్గము జన్మగతికిఁ జేరువ ని- ష్కర్మము పాతకమునకుఁ దొడవు కర్మిగావలెనో నిష్కర్మి గావలెనో యీ- మర్మంపు మదము మాన దేమిసేతు ॥చ3॥ శరణాగత రక్షకుడవైనయట్టి తిరువేంకటగిరిదేవుఁడా పరిపూర్ణఁడవో నీవు పరిచ్ఛిన్నుఁడవో ని- న్నరసి భజింపలేనైతి నేమిసేతు |
రాగము: ఛాయనాట రేకు: 0061-01 సంపుటము: 1-310 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఛాయనాట