తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ
॥పల్లవి॥ తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁ దెలియుట దనలోఁ దెలియుట కొరకే voltaren végbélkúp voltaren szemcsepp ॥చ1॥ ఉదయమందుట భవముడుగుట కొరకే చదువుట మేలువిచారించు కొరకే బ్రదుకుట పురుషార్ధపరుఁడౌట కొరకే యెదిరిఁ గనుట తన్నెఱుఁగుట కొరకే ॥చ2॥ తగులుట విడివడఁదలఁచుట కొరకే నొగులుట కర్మమునుభవించు కొరకే చిగురౌట కొమ్మయి చెలఁగుట కొరకే బెగడుట దురితము పెడఁబాయు కొరకే ॥చ3॥ యీవలఁ జేయుట ఆవలి కొరకే ఆవలనుండుట యీవలఁ కొరకే యీవలనావల నెనయఁ దిరుగుటెల్ల శ్రీవేంకటేశ్వరుఁ జేరుట కొరకే |
రాగము: దేవగాంధారి రేకు: 0011-04 సంపుటము: 1-70 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేవగాంధారి