
తనవారని యాస దగిలి భ్రమయనేల – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తనవారని యాస దగిలి భ్రమయనేల తనువుఁ బ్రాణునికంటె తగులేది ॥చ1॥ తనువుఁ బ్రాణుడు రెండు తగిలి గర్భమునందు వొనర నేకమై యుదయించి దినములు చెల్లిన తివిరి యాప్రాణుఁడు తనువువిడిచిపోయ దయలేక ॥చ2॥ ప్రాణికై దేహము పాపపుణ్యముసేయు ప్రాణి వెంటనె బొంది పాశుండదు ప్రాణి యచ్చటనైన బాధలఁ బడకుండ ప్రాణి రక్షించు బొందిబడి దాఁ బోయనా ॥చ3॥ యెరవుల దేహలివి నిజమని నమ్మి యెరిఁగీనెఱుఁగలే రిది యాలా అరయఁ బరమునకు నాది పురుషుఁడై పరగుశ్రీ వేంకటపతి గలిగుండఁగా |
రాగము: వరాళి రేకు: 0036-03 సంపుటము: 1-222 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, వరాళి