
జీవో 69 (శ్రీశైలం నీటిమట్టం నిర్వహణ)
జీవో నెంబర్ : 69 (సాగునీటి పారుదల శాఖ)
విడుదల తేదీ : 15.06.1996
ప్రధాన ఉద్దేశ్యం : ‘కృష్ణా జలాలను ఎక్కడా ఆపకుండా వీలైనంత త్వరగా డెల్టాకు చేరవేయడం‘ అని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటారు.
జీవో 69 సారాంశం :
విద్యుత్ ఉత్పత్తి నెపంతో అధికారికంగా శ్రీశైలం నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించేందుకు ‘జీవో 69’ని ఆం.ప్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో శ్రీశైలం జలాశయ కనీస నిర్వహణా నీటిమట్టాన్ని 834 అడుగులుగా పేర్కొన్నారు. అంటే శ్రీశైలం జలాశయంలో నీరు 834 అడుగులకు చేరిన వెంటనే విద్యుత్ ఉత్పత్తి పేరుతొ నీటిని నాగార్జున సాగర్‌కు తరలించేందుకు ఈ జీవో వీలు కల్పిస్తోంది. ఫలితంగా రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది.
ఈ జీవో ప్రకారం శ్రీశైలం జలాశయంలో 834 అడుగుల కన్న తక్కువ స్థాయిలో నీరు ఉన్నప్పుడు ఎలాంటి ప్రయోజనాలకు నీటిని విడుదల చేయకూడదు. కేవలం తాగునీటి కోసం మాత్రమే అవసరమైన మేరకు మినహాయింపు ఉంటుంది.
ఈ జీవో 69 శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల విషయంలో ఈ క్రింది ప్రాధాన్యతలను పాటించాలని ఆదేశించింది….
-
- 1. 15 టీఎంసీల వరకు మద్రాసుకు తాగు నీటిసరఫరా
-
- 2. హైదరాబాద్ తాగునీటి సరఫరా
-
- 3. శ్రీశైలం కుడిపక్కన ఉన్న విద్యుత్ కేంద్రానికి ఉపయోగించుకుంటూ హైడ్రోపవర్ ఉత్పత్తి 90 శాతం విశ్వసనీయతన కనీసం 1170 ఎంకేడబ్ల్యుహెచ్ (మిలియన్ కిలోవాట్ అవర్) విద్యుత్ ను సాలీనా ఉత్పత్తి చేయాలి.
-
- 4. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేసే నీటితోనే విద్యుత్ ఉత్పత్తి చెయ్యాలి.
-
- 5. శ్రీశైలం కుడిగట్టు కాలువ సాగునీటి అవసరాలు
-
- 6. తెలుగుగంగ ప్రాజెక్టు సాగునీటి అవసరాలు
-
- 7. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సాగునీటి అవసరాలు.
ఇందులో రాయలసీమకు సాగునీటి అవసరాలను చివరి ప్రాధాన్యతగా గుర్తించారు. అలాగే సీమ తాగునీటి అవసరాలకు సంబంధించిన అవసరాలు ఈ జీవోలో పేర్కొనలేదు.
జీవో 69 ప్రతి (Copy of GO 69) :