గురువారం , 21 నవంబర్ 2024

తెదేపా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 120 ఇదే!

కడప: అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి ‘జీవో 120’ని విడుదల చేసింది.

ఈ సంవత్సరం కొంతమంది రాయలసీమ విద్యార్థులు కోర్టు గడప ఎక్కడంతో రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కన పట్టి బరితెగించి, అడ్డగోలుగా తెదేపా ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో 120 వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ జీవో ఆధారంగా ఈ సంవత్సరం నిర్వహించిన మెడికల్ కౌన్సిలింగ్ లో మెరిట్ కోటాలో (107 సీట్లలో) అధిక సీట్లను రాయలసీమేతరులు దక్కించుకున్నారు.

చదవండి :  సంప్రదాయం ప్రకారమే కోదండరాముని పెళ్లి

ఈ వ్యవహారం పైన ఇప్పటికే ప్రభుత్వ జీవోను తప్పు పట్టిన రాష్ట్ర హైకోర్టు పద్మావతి మహిళా వైద్యకళాశాలలోని 85% సీట్లను (107 సీట్లను) ఎస్వీయు రీజియన్ (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు) విద్యార్థులకే కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 120ని ఇక్కడ ఇస్తున్నాం…

చదవండి :  అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -2

జీవో 120జీవో 120జీవో 120జీవో 120GO120జీవో 120go120జీవో 120జీవో 120జీవో 120

జీవో 120 యొక్క పిడిఎఫ్ ప్రతి:

పిడిఎఫ్ ప్రతి కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: