వాయిదా పడిన జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నిక ఏక్షణాన ఏ మలుపు తిరుగుతుందోనని ప్రతి ఒక్కరూఆసక్తిగా గమనిస్తున్నారు. మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 9 స్థానాల్లో, టీడీపీ 11స్థానాల్లో విజయం సాధించింది. అయితే స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటునుఇక్కడే వినియోగించుకుంటుండటంతో రెండు పార్టీలకు సమానంగా 11 మంది సభ్యులున్నట్లయింది.
దీంతో ఈనెల 3వతేదీన లాటరీ పద్ధతిలో ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌లను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.అనూహ్యంగా ఒకటో వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ ముల్లాజానీ గైర్హాజరు కావడంతో టీడీపీ శ్రేణులుతమ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా ప్రిసైడింగ్ అధికారి ఎన్నిక 4వతేదీకి వాయిదావేశారు.
అయితే కనిపించకుండా పోయిన కౌన్సిలర్ జానీ ప్రిసైడింగ్‌అధికారితో నేరుగా ఫోన్‌లో మాట్లాడి తనను ఎవరూకిడ్నాప్ చేయలేదని చెప్పారు. 4వతేదీ ఎన్నిక జరుగుతుందని అందరూ భావించారు. ఆ రోజు కోరం ఉన్నప్పటికీప్రిసైడింగ్ అధికారి తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఎన్నిక నిర్వహించలేనని చేతులు ఎత్తేయడంతో రెండో రోజుకూడా వాయిదాపడింది. దీంతో ఎన్నికల కమిషన్‌ఈనెల 13వతేదీన మున్సిపల్‌ై చెర్మన్, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించింది.
ఇంతలో ఒకటో వార్డుకు చెందిన కౌన్సిలర్‌ముల్లాజానీ ఓటును పరిగణలోనికి తీసుకోకూడదనిఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టు జానీ ఓటును పరిగణలోనికి తీసుకోకూడదని తీర్పునిచ్చింది. అయితే శనివారం తిరిగి టీడీపీనాయకులు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఈ తీర్పుపై స్టే విధించినట్లు సమాచారం.
ఆదివారం జరిగే ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా జిల్లాజాయింట్ కలెక్టర్ రామారావుతో, పరిశీలకునిగా ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్‌ను నియమించారు. వీరి పర్యవేక్షణలో పకడ్బందీగా ఎన్నిక నిర్వహించేందుకు కసరత్తుచేస్తున్నారు.
అదేవిధంగా కౌన్సిల్‌హాల్‌లో ఇరుపార్టీలకు చెందిన కౌన్సిలర్లు గొడవలకు దిగకుండా మధ్యలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక గ్యాలరీలనుఏర్పాటు చేశారు.
ఇప్పటికే రెండు సార్లు మున్సిపల్‌పాలక వర్గానికి సంబంధించిన ఎన్నికవాయిదా పడటంతో ఇకపై వాయిదా పడకుండా, ఎలాంటి గొడవలు జరగకుండాఉండేందుకు కలెక్టర్, ఎస్పీలు పట్టణంలోఉండి స్వయంగా ఎన్నికలు, శాంతిభద్రతలనుపర్యవేక్షించనున్నారు.
ఇంతకీ జానీ ఓటేస్తాడా? లేదా?