గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన – 2
చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు…
వర్గం : శృంగార సంకీర్తన
రాగము: ముఖారి
రేకు: 1009-2
సంపుటము: 20-50
‘చెల్లునా నీ కీపనులు’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.
చెల్లునా నీ కీపనులు చెన్న కేశా
కొల్లకాఁడ వౌర గండిగోట చెన్నకేశా ॥పల్లవి॥
అంగవించి మగనాలి కాసపడే విందరిలోఁ
జెంగలింపుఁ జూపులతోఁ జెన్నకేశ
రంగుమీర నిరువంక రమణు లిద్దరుండుఁగా
అంగన లింకానా ఔరా చెన్నకేశా ॥చెల్లునా॥
కమ్మటి మానవు మమ్ముఁ గరఁగించే వూరకైనా
చిమ్ముఁదేనె మాటలతోఁ జెన్నకేశ
దొమ్మిసేసి మగువల తొల్లె యాఱడిఁ బెట్టితి-
వమ్మరో నీకు వెరతుమౌర చెన్నకేశా ॥చెల్లునా॥
వావి గద్దంటా నాతో వచ్చి వచ్చి నవ్వేవు
శ్రీవేంకటాద్రి మీఁదఁ జెన్న కేశ
కావిమోవి గంటిసేసి కమ్మి నన్నుఁగూడితివి
ఆవేశ నేమననైతి (నే మనసైతి)చెన్న కేశా ॥చెల్లునా॥
సంకీర్తన వినండి: