చెప్పినంతపని నేఁ జేయఁగలవాఁడ నింతే – అన్నమయ్య సంకీర్తన

చెప్పినంతపని నేఁ జేయఁగలవాఁడ నింతే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
చెప్పినంతపని నేఁ జేయఁగలవాఁడ నింతే
అప్పటి నపరాధమా ఆదరించవలదా
॥చ1॥
నియ్యాజ్ఞ దేహము నే మోఁచితి నింతే
యియ్యెడ విజ్ఞానమేల యియ్యవయ్యా
వెయ్యవేలై వేగుదాఁక వెట్టిసేసి యలసితి
వొయయ్య కొంతైనా వూరడించవలదా
॥చ2॥
నీవు సేసే కర్మము నేఁ జేయువాఁడ నింతే
యీవల నానందసుఖ మియ్యవయ్యా
కోవరమై వెంటవెంటఁ గొలిచినబంట్లకు
తావులఁ గొంతవడైనా దప్పిదీర్చవలదా
॥చ3॥
మతిలో శ్రీవేంకటేశ మనికైనవాఁడ నింతే
తతి నాపాటుకు దయదలఁచవయ్యా
యితవై పనిసేసేటి యింటపసురమునకు
వెతదీరఁ బాలార్చి వెడ్డువెట్టఁదగదా
రాగము: ముఖారి
రేకు: 0085-02
సంపుటము: 1-412

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  అతనికెట్ల సతమైతినో కడు- - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: