గురువారం , 21 నవంబర్ 2024

గండికోటలో మళ్ళా చిరుత పులి పంజా విసిరింది

గండికోట: గండికోటలో మళ్ళా చిరుత పులి పంజా విసిరింది. కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా ఎటువంటి దాడులూ చేయకుండా నిశ్శబ్దంగా ఉండిన చిరుతపులి(లు) శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఎనిమిది గొర్రెలను చంపింది. చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

 దాడిలో చనిపోయిన పొట్టేలు
దాడిలో చనిపోయిన పొట్టేలు

ఇంతకుముందు కూడా చిరుత ఇలాగే గొర్రెల మీద దాడి (జత చేసిన చిత్రం అప్పటిదే) చేసింది. దాంతో గత సెప్టెంబరు నెలలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఒకటిన్న సంవత్సరం వయసున్న  చిరుత చిక్కడంతో దానిని తిరుపతి జంతుప్రదర్శనశాలకు తరలించారు (http://wp.me/p4r10f-19a). అప్పట్లోనే అధికారులు ఇక్కడ ఇంకో చిరుత కూడా ఉన్నట్లు ప్రకటించి బోనును ఏర్పాటు చేశారు.

చదవండి :  మైలవరంలో 'మర్యాద రామన్న' చిత్రీకరణ

అయితే అప్పటి నుండి చిరుత గ్రామం వైపు రాకపోవడంతో బోనులో చిక్కలేదు. ఈ నేపధ్యంలో అధికారులు గండికోటలో ఏర్పాటు చేసిన బోనును తొలగించినట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలో ఒక రైతుకు చెందిన పొట్టేళ్ళు చిరుత దాడిలో మరణించడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. ఈ నేపధ్యంలో గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం అధికారులు మళ్ళీ చిరుతను పట్టుకోవటానికి గండికోటలో బోను ఏర్పాటు చేశారు.

ఒకేసారి ఎనిమిది పొట్టేళ్ళు చిరుత దాడిలో చనిపోవడంతో ఒకటి కన్నా ఎక్కువ చిరుతలు ఉండవచ్చునని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి :  నేడు జిల్లాకు ముఖ్యమంత్రి

వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం వన్యమృగాలను ఎవరైనా చంపితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25లక్షల జరిమానా విధిస్తారు. చిరుత పులుల దాడిలో గొర్రెలను కోల్పోయిన వారు అటవీశాఖ నుండి నష్టపరిహారం పొందే వీలుంది.

ఇదీ చదవండి!

గండికోట కావ్యం

తొలి ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యం – ‘గండికోట’ – మొదటి భాగం

గండికోట కావ్యం సమీక్ష తెలుగులో ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యాలు స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలా వచ్చాయి. వీటిని చారిత్రక …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: