
ఈ పొద్దూ రేపూ చింతకొమ్మదిన్నె గంగమ్మ జాతర
చింతకొమ్మదిన్నె గంగ జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. మహాశివరాత్రి అనంతరం రెండురోజుల తరువాత ఈ జాతరను అనాదిగా నిర్వహిస్తున్నారు. జాతరకు రాయలసీమ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.
గంగ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా, వాహనాల రాకపోకలు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
చింతకొమ్మదిన్నె నుంచి అమ్మవారిని ఆనవాయితీ ప్రకారం అలంకరించి మేళతాళలతో కొత్తపేట గంగమ్మ ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ఆవరణలో ఆదివారం రాత్రి 11 గంటల నుంచి గంగమ్మకు శివుని త్రిశూలానికి ఘనంగా కల్యాణం నిర్వహించనున్నారు.