గురువారం , 21 నవంబర్ 2024

చింతకుంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవళం

కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట లోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైనది. చింతకుంట గ్రామ శివార్ల లోని చెరువు , గ్రామంలో శిధిలావస్థలో ఉన్న శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం చింతకుంట గ్రామ పురాతన  చరిత్రకు, గతంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక  వైభవానికి  తార్కాణంగా నిలుస్తున్నాయి.

chintakunta
చెన్నకేశవ స్వామి దేవళం

చెన్నకేశవ ఆలయం జనమేజయుని కాలంలో నిర్మించబడిందని గ్రామస్తులు చెబుతున్నప్పటికీ ఆలయ వాస్తు, నిర్మాణ రీతులను పరిశీలిస్తే ఈ ఆలయం విజయనగర రాజులకాలంలో 13,14 శతాబ్దాల కాలంలో నిర్మించ బడినట్లుగా దాఖలాలున్నాయి . ఆ తర్వాత 1897 వ సంవత్సరం జూన్ 24 తేదీన అంతరాల ముఖమండప పునర్నిర్మాణం జరిగింది.

చదవండి :  మైదుకూరు సదానందమఠం

గ్రామానికి చెందిన చితిరాల సుబ్బన్న కుమారుడు చిన్న సుబ్బ్బన్నఈ ముఖమండపాన్ని నిర్మించినట్లు ఆలయ ప్రవేశద్వారం పైన ఉన్న శాసనం వల్ల తెలుస్తోంది.  చెన్నకేశవ స్వామి ఆలయం విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది.

గర్భగుడిలోని మూలవిరాట్టు పడమరకు అభిముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు . ఆలయ ప్రాంగణంలో పురాతన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని  భిన్నమైన రూపంలో చూడవచ్చు. గర్భగుడి ప్రవేశద్వారం అందమైన శిల్పాలతో చెక్కబడి ఉంది. ప్రవేశద్వారం ద్వారబంధంపై  గజలక్ష్మిదేవిని అందంగా చెక్కారు. ద్వారబంధం పైకప్పుపై శంఖు, విష్ణునామం, చక్రం చెక్కబడి ఉన్నాయి .

చెన్నకేశవుని విగ్రహం
చెన్నకేశవుని విగ్రహం
లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం

గర్భగుడి అంతరాళంలో శ్రీలక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ప్రసన్న వదనంతో భక్తులపై కరుణరసాన్ని కురిపిస్తున్నట్ట్లుగా ఉంది.

చదవండి :  'మిసోలిథిక్‌' చిత్రాల స్థావరం చింతకుంట

అంతరాళం ప్రవేశద్వారానికి చెక్కబడిన జయవిజయుల శిల్పాలు అద్భుత కళానైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గర్భగుడికి దక్షిణ దిశలో నాగశిల్పాలు ఉన్నాయి.

ఆలయ మండపానికి వాయువ్యదిశలో ధ్వజస్తంభం , మరో రాతిస్తంభం ఉన్నాయి. గతంలో శిధిలమై పోయిన ఆలయ ఉత్తర ప్రహారిని ఇటీవలే   పునర్నిర్మించారు.

చెన్నకేశవాలయానికి కె.సి.కాలువ కింద 4.25 ఎకరాలు, చింతకుంట చెరువు కింద 40 సెంట్లు , గడ్డంవారిపల్లె పొలంలో 2.75 ఎకరాలు మాన్యం భూములున్నాయి.

అలయపుజారిగా శ్రీ చెరువు వెంకటసాయి గారు వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా చెన్నకేశవస్వామి గ్రామోత్సవం వైభవంగా జరుగుతుంది. చింతకుంట తోపాటు మీర్జగానిపల్లె , రామాపురం, గడ్డంవారిపల్లె గ్రామాల్లో చెన్నకేశవస్వామిని ఊరేగిస్తారు.

చదవండి :  చెట్టూ చేమల పేర్లు కలిగిన ఊర్లు

గ్రామంలోని పురాతన సోమేశ్వర ఆలయం పరిస్థితిని పరిశీలిస్తే వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తోంది . ఈ ఆలయం పూర్తిగా శిధిల స్థితికి చేరుకొంది.  ఈ ఆలయ బాగోగులను దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా విస్మరించారు.

చింతకుంటలోని చెన్నకేశవ , సోమేశ్వర దేవస్థానాలను దేవాదాయ శాఖ పరిరక్షించాలని భారతీయ వారసత్వ సాంస్కృతిక పరిరక్షణా సంస్థ (INTACH)జిల్లా సభ్యుడు , తెలుగు సమాజం వ్యవస్థాపక  అధ్యక్షుడు, రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

చింతకుంట దేవళాల ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదీ చదవండి!

తిరుమలనాధుడు

సంబెట శివరాజు నిర్మించిన తిరుమలనాథ ఆలయం!

వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లా మైదుకూరు మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ ఆలయం చారిత్రక విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: