
చాలదా హరిసంకీర్తనంగల- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ చాలదా హరిసంకీర్తనంగల- మే లిది దీననే మెరసిరి ఘనులు ॥చ1॥ తలఁప వేదాశాస్త్రములు గానక అలరుచు వాల్మీకాదులు తలకొని హరిమంత్రమే దగఁ బేర్కొని అలవిమీరఁ గడు నధికములైరి ॥చ2॥ యితరదైవముల నెఱఁగనేరక ప్రతిలేనిమహిమఁ బార్వతి మతిఁ దలఁపుచు హరిమంత్రమె పేర్కొని సతతము హరులో సగమై నిలిచె ॥చ3॥ చదువులుఁ బలుమరుఁ జదువనోపక అదివో నారదాదులు పదిలపువేంకటపతిహరినామమే వదల కిదియ జీవనమై మనిరి |
రాగము: సామంతం రేకు: 0033-04 సంపుటము: 1-205 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం