చాలదా హరినామ సౌఖ్యామృతము – అన్నమయ్య సంకీర్తన

చాలదా హరినామ సౌఖ్యామృతము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
చాలదా హరినామ సౌఖ్యామృతము దమకు
చాలదా హితవైన చవులెల్ల నొసఁగ
॥చ1॥
ఇదియొకటి హరినామ మింతైనఁ జాలదా
చెదరకీ జన్మముల చెఱలు విడిపించ
మది నొకటె హరినామ మంత్రమది చాలఁదా
పదివేలు నరకకూపముల వెడిలించ
॥చ2॥
కలదొకటి హరినామ కనకాద్రి చాలదా
తొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచ
తెలివొకటి హరినామ దీపమది చాలదా
కలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల
॥చ3॥
తగువేంకటేశు కీర్తన మొకటి చాలదా
జగములో కల్పభూజంబు వలెనుండ
సొగిసి యీ విభునిదాసుల కరుణ చాలదా
నగవుఁజూపులను నున్నతమెపుడుఁ జూప
రాగము: శ్రీరాగం
రేకు: 0008-04
సంపుటము: 1-52

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  తెలిసిన బ్రహ్మపదేశ మిదే - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: