చదివెఁబో ప్రాణి సకలము యీ- – అన్నమయ్య సంకీర్తన

చదివెఁబో ప్రాణి సకలము యీ- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
చదివెఁబో ప్రాణి సకలము యీ-
చదువుమీఁది విద్య చదువఁడాయఁగాని
॥చ1॥
సిరులు చంచలమని చేఁతలధ్రువమని
పరగుసంసారము బయలని
తొరలిన సుఖమెల్ల దు: ఖమూలమని
యెరిఁగి లోభమువీడ నెరఁగఁడాయఁగాని
॥చ2॥
తలకొన్న ధర్మమే తలమీఁది మోఁపని
వలసీనొల్లమి దైవవశమని
కలిమియు లేమియుఁ గడవఁగ రాదని
తెలిసి లోభము వీడఁ దెలియఁడాయఁగాని
॥చ3॥
యేచిన పరహితమెంతయుఁ దమ దని
వాచవులిన్ని నెవ్వగలని
యీచందమున వేంకటేశుచేఁతలని
చూచి లోభమువీడఁ జూడడాయఁగాని
రాగము: ధన్నాశి
రేకు: 0065-06
సంపుటము: 1-339

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ధన్నాశి

చదవండి :  చక్రమా హరి చక్రమా

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: