
చక్రమా హరి చక్రమా
॥పల్లవి॥ చక్రమా హరి చక్రమా వక్రమైన దనుజుల వక్కలించవో voltaren végbélkúp voltaren végbélkúp voltaren szemcsepp ॥చ1॥ చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని- చట్టలు చీరిన వో చక్రమా పట్టిన శ్రీహరి చేతఁ బాయక యీ జగములు వొట్టుకొని కావగదవో వో చక్రమా ॥చ2॥ పానుకొని దనుజుల బలుకిరీటమణుల సానలఁ దీరిన వో చక్రమా నానాజీవముల ప్రాణములుగాచి ధర్మ- మూని నిలుపఁగదవో వో చక్రమా ॥చ3॥ వెఱచి బ్రహ్మాదులు వేదమంత్రముల నీ వుఱుట్లు గొనియాడేరో చక్రమా అఱిముఱిఁ దిరు వేంకటాద్రీశు వీధుల వొఱవుల మెఱయుదువో వో చక్రమా |
రాగము: పాడి రేకు: 0030-02 సంపుటము: 1-183 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, పాడి