
కడప జిల్లాకు చంద్రబాబు హామీలు
వివిధ సందర్భాలలో తెదేపా అధినేత చంద్రబాబు కడప జిల్లాకు గుప్పించిన హామీలు…
తేదీ: 30 అక్టోబర్ 2018, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో ధర్మ పోరాట దీక్ష ప్రదేశం: ప్రొద్దుటూరు, కడప జిల్లా
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు :
- కేంద్రం ముందుకు రానందున మేమే ముందుకు వచ్చి నెలరోజుల్లో కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తాం
- పులివెందులలో చీనీ చెట్లు ఎండకుండా కాపాడిన ఘనత మాది
- 677 కోట్లు వ్యయం చేసి గండికోటను పూర్తిచేసి 12 టిఎంసిలు నిల్వ చేశాం.
తేదీ: 30 జూన్ 2018, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో దీక్ష చేస్తున్న సి.ఎం.రమేష్ కు పరామర్శ ప్రదేశం: జిల్లా పరిషత్ ప్రాంగణం, కడప నగరం
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు కేంద్రం ముందుకు వస్తే మేం పూర్తిగా సహకరిస్తాం.ఇందుకోసం కేంద్రానికి రెండు నెలలు గడువిస్తున్నాం.
- కడపలో ఉక్కు పరిశ్రమపై కేంద్రం పూటకోమాట చెబుతోంది. నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా ముందడుగు వేస్తున్న 108 వెనుకబడిన జిల్లాలను గుర్తించగా అందులో కడప ప్రస్తుతం 5వస్థానంలో నిలిచింది.
- కడప ఉక్కు పరిశ్రమపై మెకాన్ సంస్థను అధ్యయనానికి వేశాక ప్రాథమిక నివేదికలో ఫీజుబులిటీ(ఆర్థికంగా అనుకూలత) ఉందని పేర్కొన్నా కేంద్రం లెక్కపెట్టకుండా పనిచేస్తోంది
- పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాకపోతే ప్రయివేటు సంస్థలకు రాయితీలు ఇచ్చి, సదుపాయాలు కల్పించి పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పిస్తాం.
- ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కడప కన్నా అనుకూలమైన ప్రాంతం ఏది ఉందో కేంద్రం సమాధానం చెప్పాలి
తేదీ: 1 సెప్టెంబర్ 2016, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో కరువు పైన ఏరియల్ సర్వే ప్రదేశం: కంచరపల్లి, రాయచోటి మండలం
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- గన్‌ల సంస్కృతి రాజ్యమేలిన ఈ ప్రాంతంలో రెయిన్‌గన్‌లతో కరవుపై పోరాటం చేస్తున్నా
- సీమ నడిబొడ్డుగా ఉన్న రాయచోటిలో కరవు పారదోలేందుకు నా వంతు ప్రయత్నిస్తా
- రాయలసీమను భవిష్యత్తులో కరవు రహిత ప్రాంతంగా తయారు చేస్తా
- శ్రీశైలం జలాలను వెలిగోడు, బ్రహ్మంసాగర్‌కు చేర్చి ఆయకట్టు సస్యశ్యామలం చేస్తా
- గండికోట, తెలుగుగంగలో అడ్డంకులను తొలగిస్తా
తేదీ: 7 మే 2016, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో ఉద్యాన రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీ, ప్రదేశం: మున్సిపల్ మైదానం, కడప
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- కడప జిల్లాను టూరిజం, హర్టికల్చర్ హబ్ గా తయారు చేస్తా
- బిందు సేద్యాన్ని ప్రొత్సహించేందుకు కడప జిల్లాకు అనంతపురం జిల్లా మాదిరి 90శాతం సబ్సిడి ఇస్తా
తేదీ: 9 జనవరి 2016, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో జన్మభూమి – మా ఊరు కార్యక్రమానికి హాజరు, ప్రదేశం: ఆలంఖాన్ పల్లె, కడప
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- కడప నుండి హైదరాబాదు, బెంగుళూరు, అమరావతి నగరాలకు విమాన సర్వీసుల ఏర్పాటు
- బుగ్గవంక సుందరీకరణ పూర్తిచేస్తాం
- పట్టిసీమ నీటిని తెచ్చి రాయలసీమను సస్యస్యామలం చేయటానికి కృషి చేస్తున్నాం
తేదీ: 20 నవంబరు 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో వరద ప్రాంతాల పర్యటన, ప్రదేశం: రైల్వేకోడూరు పట్టణం, సమీప గ్రామాలు
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- రైల్వేకోడూరులో కావాల్సినన్ని శీతల గిడ్డంగులు ఏర్పాటు
- గుంజనేరుపైన కిలోమీటరుకు ఒకటి చొప్పున వంద చెక్ డ్యాముల ఏర్పాటు
- గుంజనేరు – గాలేరు నగరి కాల్వల అనుసంధానం
- గాలేరు – నగరి ప్రాజెక్టు పూర్తి చేస్తాం
తేదీ: 9 నవంబరు 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో కడప జిల్లా పర్యటన, బహిరంగ సభ ప్రదేశం: ముద్దనూరు
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు:
- టూరిజం కేంద్రంగా గండికోట అభివృద్ది (పాత హామీ పునశ్చరణ)
- 2016 నాటికి గండికోట జలాశయానికి సాగునీరు (పాత హామీకి కొత్త గడువు)
- కడప జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు 2016కు పూర్తి చేస్తాం(పాత హామీకి కొత్త గడువు)
- కెసి కెనాల్ కింద సాగులో ఉన్న పంటలకు నీళ్ళు
- సర్వారాయ సాగర్ నుండి కడప నగరానికి నీళ్ళు
- రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం (పాత హామీ పునశ్చరణ)
- ముద్దనూరులో తితిదే కళ్యాణమండపం, షాదీఖానా, కమ్యూనిటీ భవనాలు
- ఉక్కు, సిమెంటు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం (పాత హామీ పునశ్చరణ)
తేదీ: 17 ఆగష్టు 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో ఇరిగేషన్ అధికారులతో 10 ని||ల సమీక్ష, ప్రదేశం: కడప విమానాశ్రయం
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- హంద్రీనీవా ద్వారా రాయచోటికి నీరందేలా చూడాలి
- కడపలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం
- రాయలసీమ కోసమే పట్టిసీమ
తేదీ: 7 జూన్ 2015, సందర్భం: విమానాశ్రయ ప్రారంభోత్సవం, జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ప్రదేశం: కడప, ఖాజీపేట
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- రెండేళ్లలో గాలేరు-నగరి పూర్తి
- గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా
- ఒంటిమిట్ట, తాళ్ళపాకలకు టూరిజం సర్క్యూట్లో భాగం కల్పిస్తా
- కడపలో హజ్ హౌస్ ఏర్పాటు చేస్తాం
తేదీ: 8 మే 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో జలదీక్ష బహిరంగసభ ప్రదేశం: కమలాపురం
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా జలాలు సీమకు తరలించి కరువు లేకుండా చేస్తా
తేదీ: 2 ఏప్రిల్ 2015, సందర్భం: కోదండరాముని పెళ్లి ఉత్సవంలో పాల్గొనడం, ప్రదేశం: ఒంటిమిట్ట
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- 50 కోట్లతో ఒంటిమిట్ట కోదండరామాలయ అభివృద్ది
- మరో తిరుమలలా ఒంటిమిట్టను తీర్చిదిద్దుతాం
- 34 కోట్లతో శ్రీరామ ఎత్తిపోతల పథకం ఏర్పాటు (ఆరు నెలలలో పనుల పూర్తి)
- ఒంటిమిట్ట, తాళ్ళపాకలకు టూరిజం సర్క్యూట్లో భాగం
తేదీ: 27 ఫిబ్రవరి 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ప్రదేశం: గండికోట జలాశయం
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- కాల్వ గట్లపై నిద్రించి అయినా 2015 జులై నాటికి గండికోటకు 35 టిఎంసిల నీరు నిల్వ చేస్తా
- ఒంటిమిట్టను టూరిజం సర్క్యూట్లో భాగం చేస్తాం
- కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ తెస్తా (విభజన చట్టంలో భాగంగా ఉన్నఅంశం)
తేదీ: 8 నవంబరు 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో జన్మభూమి- మా ఊరు గ్రామ సభ ప్రదేశం: ఓబనపల్లె
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- ఏమీ లేవు
తేదీ: 4 సెప్టెంబరు 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రకటన ప్రదేశం: ఆం.ప్ర శాసనసభ, హైదరాబాద్
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు (విభజన చట్టంలోని హామీ)
- సిమెంటు పరిశ్రమల ఏర్పాటు
- పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు
- కడప విమానాశ్రయం వాడుకలోకి తేవడం
- ఫుడ్ పార్క్ ఏర్పాటు
- ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు
- గార్మెంట్ క్లస్టర్ ఏర్పాటు
- సౌర, పవన విద్యుతుత్పత్తి కేంద్రాల ఏర్పాటు
తేదీ: 7 ఏప్రిల్ 2014, సందర్భం: ప్రజాగర్జన సభ (ఎన్నికల ప్రచారం) ప్రదేశం: పురపాలిక మైదానం, కడప
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- ఐటీ హబ్ గా కడప
- కడపలో హైటెక్ సిటీ
- కడప విమానాశ్రయ అభివృద్ది
- కడపను స్మార్ట్ సిటీగా తయారుచేస్తా
తేదీ: 31 మార్చి 2014, సందర్భం: ఎన్నికల మేనిఫెస్టో ప్రదేశం: హైదరాబాదు
[divider style=”normal” top=”10″ bottom=”10″]
ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:
- కడప, అనంతపురం జిల్లాలలో ఇనుప ఖనిజం ఆధారంగా ఉక్కు కర్మాగారాల నిర్మాణానికి కృషి
- కర్నూలు, అనంతపురం, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలలో గొర్రెల పెంపకం అభివృద్ది, మాంస ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం
- కడప నుండి అనంతపురం, చిత్తూరు, ఒంగోలులకు నాలుగు వరుసల రహదారుల ఏర్పాటు (పేజీ 39)