
ఘెరదురితములచే గుణవికారములచే – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఘెరదురితములచే గుణవికారములచే నీరీతిఁబడునాకు నేది దెరువు ॥చ1॥ హరి జగన్నాథు లోకరాధ్యు- నెరఁగనేరనివాని కేది దెరువు పరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి- నిరవుకొలుపనివాని కేది దెరువు ॥చ2॥ శ్రీ వేంకటేశుఁ దలఁచినవెనక సకలంబు …. నేవగింపనివారి కేది దెరువు దేవోత్తముని మహిమ దెలిసితెలియఁగలేని- యీవివేకంబునకు నేది దెరువు |
రాగము: ధన్నాశి రేకు: 0069-06 సంపుటము: 1-363 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ధన్నాశి